RRB Group D Recruitment Notification 2025: భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 32,438 గ్రూప్-డి (లెవెల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు భారతదేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025 నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 22, 2025 వరకు కొనసాగుతుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 32,438
విభాగాలు: ఎస్ అండ్ టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ట్రాఫిక్.
- పాయింట్స్‌మన్ – 5,058
- అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) – 799
- అసిస్టెంట్ (బ్రిడ్జ్) – 301
- ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187
- అసిస్టెంట్ పీ-వే – 247
- అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ) – 2587
- అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్) – 420
- అసిస్టెంట్ (వర్క్‌షాప్) – 3077
- అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ) – 2012
- అసిస్టెంట్ టీఆర్‌డీ – 1381
- అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) – 950
- అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్) – 744
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ – 1041
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్) – 625
అర్హతలు: పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత. టెక్నికల్ విభాగాల కోసం NCVT నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా ఐటీఐ డిప్లొమా అవసరం.
వయోపరిమితి: 01/01/2025 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
- సాధారణ, EWS, OBC అభ్యర్థులకు: రూ.500 (CBT పరీక్షకు హాజరైన తర్వాత బ్యాంక్ ఛార్జీలు మినహా రూ.400 తిరిగి చెల్లిస్తారు)
- SC, ST, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు: రూ.250 (పరీక్షకు హాజరైన తర్వాత బ్యాంక్ ఛార్జీలు మినహా మొత్తం తిరిగి చెల్లిస్తారు)
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రారంభ జీతం: రూ. 18,000 + అలవెన్సులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా RRB అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సికింద్రాబాద్ జోన్‌లో 1,642 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మరియు అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. మరిన్ని వివరాల కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024.
నోటిఫికేషన్ జారి తేదీ: 22.01.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.
దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు.
నోటిఫికేషన్:
Advertisement No: CEN No. 08/2024
RRB Group D Recruitment Notification 2025 PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
RRB వెబ్‌సైట్ – https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
Apply Online Application – https://www.rrbapply.gov.in/