రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) లో 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ పోస్టులు రైల్వేలోని గ్రూప్ C లోపల వివిధ విభాగాల్లో భర్తీ చేయబడతాయి. NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు:
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
- ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 3,445.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
అర్హత: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
ప్రారంభ వేతనం: నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు రూ.21,700. ఇతర పోస్టులకు రూ.19,900 ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 20.09.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.10.2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.10.2024 నుంచి 29.10.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 30.10.2024 నుంచి 06.11.2024 వరకు.
RRB NTPC Ungergraduate Recruitment 2024 Notification
అధికారిక వెబ్‌సైట్:
RRB వెబ్‌సైట్ – https://www.rrbapply.gov.in/
Online Application – https://www.rrbapply.gov.in/#/auth/landing