NTPC Recruitment Notification 2025: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15, 2025 నుండి మార్చి 1, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్టీపీసీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ గురించి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థగా పేరు గాంచింది. ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని మహారత్న సంస్థగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా వివిధ థర్మల్, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణలో ఎన్టీపీసీ కీలక పాత్ర పోషిస్తోంది. NTPC సంస్థ నిరంతరం నూతన ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, మేనేజ్‌మెంట్ ట్రైనీలతో పాటు అనేక విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్)
మొత్తం ఖాళీలు: 400
కేటగిరి వారీగా ఉద్యోగాలు: యూఆర్: 172, ఈడబ్ల్యూఎస్: 40, ఓబీసీ: 82, ఎస్టీ కేటిగరిలో 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
విద్యార్హత: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో B.E/ B.Tech
పని అనుభవం: సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం
వయోపరిమితి:
గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాలు (మార్చి 1, 2025 నాటికి)
వయో సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
వేతనం: నెలకు: రూ.55,000/-
దరఖాస్తు రుసుము:
సామాన్య/ OBC/ EWS అభ్యర్థులు: రూ.300/-
SC/ ST/ PWD/ ఎక్స్‌సర్వీస్‌మెన్ మరియు మహిళా అభ్యర్థులు: రుసుము లేదు
దరఖాస్తు విధానం: అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ (https://careers.ntpc.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నుండి ప్రారంభమై, మార్చి 1, 2025 వరకు కొనసాగుతుంది.
ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.02.2025.
దరఖాస్తు చివరి తేదీ: 01-03-2025.
ఎన్టీపీసీలో ఉద్యోగం సాధించి, మీ కెరీర్‌ను మరింత అభివృద్ధి చేసుకోండి!
నోటిఫికేషన్:
NTPC Recruitment Notification 2025 PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
NTPC వెబ్‌సైట్ – https://careers.ntpc.co.in/recruitment/
Apply Online: Assistant Executive Operation on Fixed Term Basis – https://careers.ntpc.co.in/recruitment/login.php