నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌లో 188 పర్మనెంట్‌ జాబ్స్‌: National Seed Corporation Recruitment 2024

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL) ఇటీవల 188 పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వ వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ, ప్రధానంగా అధిక నాణ్యత గల విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, సరఫరా వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది.

NSCL సంస్థ గురించి

NSCL, 1963 లో స్థాపించబడింది, ఇది భారతదేశంలో ప్రధాన విత్తన ఉత్పత్తి సంస్థగా పనిచేస్తుంది. ఇది రైతులకు అధిక నాణ్యత గల విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయం రంగాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తుంది. దీనికి గల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది, ఫీల్డ్ మేనేజ్‌మెంట్ నుండి మార్కెటింగ్ వరకు వివిధ విభాగాలలో సిబ్బందిని నియమిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య – 188

  • డిప్యూటీ జనరల్ మేనేజర్: 01
  • అసిస్టెంట్ మేనేజర్: 01
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ: 05
  • సీనియర్ ట్రైనీ: 02
  • ట్రైనీ: 179

ఇతర ముఖ్యమైన సమాచారం:

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు.. మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,41,260. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.80,720.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.57,920. సీనియర్ ట్రైనీ పోస్టులకు రూ.31,856. ట్రైనీ పోస్టులకు రూ.24,616 ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 26, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్‌ 22, 2024

నోటిఫికేషన్‌:

NSCL Recruitment Notification 2024 PDF

అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు:

NSCL వెబ్‌సైట్https://www.indiaseeds.com/