India Post GDS Recruitment Notification: తపాలా శాఖలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు

India Post GDS Recruitment 2025 Notification: భారత ప్రభుత్వ తపాలా శాఖ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSs) [అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు] పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను కింది లింక్ https://indiapostgdsonline.gov.in లో ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

India Post GDS గురించి

గ్రామీణ డాక్ సేవక్ (GDS) అనేది భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టల్ సేవలను నిర్వహించడానికి ఉద్యోగులు. ఈ పోస్టులను ప్రతి గ్రామానికి సంబంధించిన పోస్టల్ సర్వీసులను నిర్వహించడానికి నియమించుకుంటారు.

ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు – 21,413
ఆంధ్రప్రదేశ్ – 1,215
తెలంగాణ – 519

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు : రూ. 100, SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ – ఫీజు లేదు.

వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

అర్హత: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు – రూ.12,000 నుండి రూ.29,380, ఏబీపీఎం/డాక్ సేవక్ – రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10.02.2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 03.03.2025.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 06.03.2025 నుంచి 08.03.2025 వరకు.

నోటిఫికేషన్‌:

Advertisement No: 17-02/2025-GDS Dated 07.02.2025

India Post GDS Recruitment Notification 2025 PDF

Circle Wise Vacancy Details PDF

అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు:

IndiaPost GDS Online వెబ్‌సైట్https://indiapostgdsonline.gov.in/

Online Gramin Dak Sevak Engagement Registration