HMFW Tirupati Attendant Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం (HMFWD), తిరుపతి లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ సూపరింటెండెంట్లు, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నియంత్రణలో ఉన్న (గత జిల్లా సంబంధిత చిత్తూరు జిల్లా) ఆరోగ్య సంస్థల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఖాళీల వివరాలు:
ల్యాబ్ అటెండెంట్: 07, జనరల్ డ్యూటీ అంటెండెంట్: 15, లైబ్రేరీ అటెండెంట్: 01, టెక్నీషియన్: 13, డేటా ఎంట్రీ ఆపరేటర్: 03, నర్సింగ్ ఆర్డర్లీ (ఫిమేల్/ మేల్): 17, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: 02, ఎలక్ట్రీషియన్/ మెకానిక్: 01, అటెండర్లు: 04, ఫిజియోథెరపిస్ట్: 02, మార్చురీ మెకానిక్: 01
మొత్తం ఖాళీల సంఖ్య – 66
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ లేదా సంబంధిత కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: పోస్టులను బట్టి నెలకు రూ.15,000- రూ.32,670 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.
ప్రొవిజన్ మెరిట్ జాబితా తేదీ: 07-03-2025.
అభ్యంతరాల చివరి తేదీ: 12-03-2025.
తుది మెరిట్ జాబితా: 15-03-2025.
ధ్రువపత్రాల పరిశీలన, నియామక ఉత్తర్వులు: 24-03-2025.
నోటిఫికేషన్:
HMFW Tirupati Attendant Recruitment Notification 2025 PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
Sri Venkateswara Medical College వెబ్‌సైట్ – https://www.svmctpt.edu.in/