Central Bank of India Credit Officer Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 క్రెడిట్‌ ఆఫీసర్ పోస్టులు

Central Bank of India Credit Officer Recruitment 2025: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4,500 కంటే ఎక్కువ శాఖల పాన్ ఇండియా బ్రాంచ్ నెట్‌వర్క్‌తో, మొత్తం రూ. 6,68,000 కోట్లకు పైగా వ్యాపారంతో మరియు 33,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కూడిన ప్రతిభావంతులైన శ్రామిక శక్తితో నడిచేది, క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I లో క్రెడిట్ ఆఫీసర్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:
క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు : 1000

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).

పే స్కేల్: నెలకు రూ.48,480 – రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.750, జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: జనవరి 30, 2025
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025

నోటిఫికేషన్‌:

Central Bank of India Credit Officer Recruitment Notification 2025 PDF

అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్https://centralbankofindia.co.in/en

Apply Online Applicationhttps://ibpsonline.ibps.in/cbicojan25/