ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 2024లో అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటీస్ పోస్టులు బ్యాంకింగ్ రంగంలో అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, మరియు డేటా మేనేజ్‌మెంట్‌లో పనిచేసేందుకు, మంచి అవకాశాన్ని అందిస్తాయి.
APCOB గురించి:
APCOB, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలకు రుణాలు అందించడం ద్వారా సహకారం అం
ప్రకటన వివరాలు:
అప్రెంటిస్: 25 ఖాళీలు
ఖాళీల వివరాలు (ట్రైనింగ్ సీట్లు):
- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా: 17
- గుంటూరు జిల్లా: 07
- చిత్తూరు జిల్లా: 01
అర్హత: బ్యాంకింగ్/ కామర్స్/ అకౌంటింగ్ అండ్ ఆడిట్/ అగ్రికల్చర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి తెలుగు/ ఇంగ్లిష్ భాషల్లో (చదవటం/ రాయడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ కాలం: ఏడాది ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ది డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామాకు పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2024
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: నవంబర్ 2, 2024.
నోటిఫికేషన్:
APCOB Apprentice Posts Recruitment Notification 2024 PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
APCOB వెబ్‌సైట్ – https://apcob.org/careers/