Andhra Pradesh Post Office GDS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1,215 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం అవసరం. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష లేకుండా, పదోతరగతి మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో జరుగుతుంది.
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS)
ఖాళీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్ – 1,215
భర్తీ విధానం: మెరిట్ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10, 2025
- దరఖాస్తు చివరి తేదీ: మార్చి 3, 2025
- ఎడిట్/కరెక్షన్ విండో: మార్చి 6 నుండి మార్చి 8, 2025
వయోపరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠం: 40 సంవత్సరాలు
వయో సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
- జనరల్/OBC/EWS అభ్యర్థులకు: ₹100
- SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు: రుసుము లేదు
వేతనం:
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM): ₹12,000 – ₹29,380
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవక్: ₹10,000 – ₹24,470
దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in ను సందర్శించండి.
నోటిఫికేషన్:
Advertisement No: 17-02/2025-GDS Dated 07.02.2025
India Post GDS Recruitment Notification 2025 PDF
Circle Wise Vacancy Details PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
IndiaPost GDS Online వెబ్‌సైట్ – https://indiapostgdsonline.gov.in/
Apply Online: India Post GDS Recruitment 2025 – https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx