AIIMS Bibinagar Recruitment 2025: హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 28, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు ఉన్న విభాగాలు:
- అనస్థీషియాలజీ
- అనాటమీ
- బయోకెమిస్ట్రీ
- డెర్మటాలజీ
- ఈఎన్‌టీ
- ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ
- జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్
- జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
- మైక్రోబయాలజీ
- ఓబీజీవై
- ఆర్థోపెడిక్స్
- ఆప్తాల్మాలజీ
- పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ
- పాథాలజీ
- ఫార్మకాలజీ
- ఫిజియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- సైకియాట్రీ
- రేడియో డయాగ్నోసిస్
- ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్‌డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు ₹1,770; EWS అభ్యర్థులు ₹1,416; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు.
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2025.
ఎంపిక విధానం:
- ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- ఇంటర్వ్యూలు మార్చి 5 నుండి మార్చి 7, 2025 వరకు AIIMS బీబీనగర్ ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు నిర్వహించబడతాయి.
నోటిఫికేషన్:
AIIMS Bibinagar Recruitment Notification 2025 PDF
అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు:
AIIMS Bibinagar వెబ్‌సైట్ – https://aiimsbibinagar.edu.in/